ETV Bharat / city

Minister Anil: మా నీళ్లను మేం వాడుకుంటే తప్పేంటి?: మంత్రి అనిల్​ - ap latest news

తెలంగాణలో అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. తాము రాష్ట్రానికి ఉన్న నీటి కేటాయింపులనే వాడుకుంటున్నామని, కొత్త ప్రాజెక్టులు ఏమీ నిర్మించడం లేదని స్పష్టం చేశారు. దిల్లీలో వారు ధర్నాలు చేస్తే చెయ్యనివ్వండన్నారు. ఏపీ తన వాదనతోనే ముందుకు వెళ్తుందని వెల్లడించారు. అపెక్సు కౌన్సిల్‌లోనే పోరాడతామని స్పష్టం చేశారు.

minister anil kumar
మంత్రి అనిల్​
author img

By

Published : Jun 21, 2021, 2:37 PM IST

Updated : Jun 22, 2021, 6:51 AM IST

మంత్రి అనిల్​

ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న నీటి కేటాయింపులనే వాడుకుంటున్నామని, కొత్త ప్రాజెక్టులు ఏమీ నిర్మించడం లేదని ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ స్పష్టంచేశారు. దిల్లీలో వారు ధర్నాలు చేస్తే చెయ్యనివ్వండన్నారు. ఏపీ తన వాదనతోనే ముందుకు వెళ్తుందని వెల్లడించారు. అపెక్సు కౌన్సిల్‌లోనే పోరాడతామని స్పష్టం చేశారు. తమకు కేటాయించిన నీటిని వాడుకుంటే అది ఎందుకు తప్పవుతుంది... రాయలసీమ ఎత్తిపోతల, రాజోలిబండ మళ్లింపు పథకాలను ఆంధ్రప్రదేశ్‌కున్న నీటి కేటాయింపుల మేరకే, నిబంధనల ప్రకారమే చేపడుతున్నమని తెలిపారు. ఏపీకి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకునేందుకు ఈ ప్రాజెక్టులు అని మంత్రి స్పష్టంచేశారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో సోమవారం అనిల్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

  • తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల కన్నా దిగువ నుంచే నీటిని ఎత్తిపోసేలా నిర్మిస్తున్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల సామర్థ్యాన్ని తెలంగాణ పెంచుతోంది. శ్రీశైలంలో నీటిమట్టం 848 అడుగుల దిగువకు చేరితే ఆంధ్రప్రదేశ్‌లో పోతిరెడ్డిపాడు కాలువలకు నీళ్లు ఇవ్వలేం. అలాంటి పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాలలోని ఆయకట్టులో పంటలను రక్షించలేని పరిస్థితులు ఉన్నాయి.
  • రాయలసీమ ఎత్తిపోతల, రాజోలిబండ ప్రాజెక్టులు విభజన చట్టానికి లోబడే ఉన్నాయి. ఏదీ కొత్త ప్రాజెక్టు కాదు. కృష్ణా పరీవాహకంలో వర్షాభావ పరిస్థితులతో 881 అడుగుల నీటిమట్టం ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. వరద తక్కువగా ఉన్నందున కాలువల సామర్థ్యం పెంచుకుంటున్నాం. కృష్ణా ట్రైబ్యునల్‌ ద్వారా ఈ ప్రాజెక్టులకు 114 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. పోతిరెడ్డిపాడుకు ఇది అనుబంధమే కానీ కొత్తది కాదు.
  • తెలంగాణలో రోజుకు 6.5 టీఎంసీలు మళ్లించేలా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టుల కోసం శ్రీశైలంలో 800 అడుగుల లోపు నుంచే నీటిని తోడుకుంటున్నారు. రాజోలిబండ ప్రాజెక్టుకు 4 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. సుంకేశుల జల విస్తరణ ప్రాంతం నుంచి తెలంగాణ తుమ్మిళ్ల ఎత్తిపోతల చేపట్టింది. అది అక్రమ ప్రాజెక్టు కాదా? దానికి ఏవిధమైన అనుమతులూ లేవు.
  • ఇరు రాష్ట్రాలు కలిసి మెలిసి ఉండాలనే ముఖ్యమంత్రి జగన్‌ భావిస్తున్నారు. రోజూ ఘర్షణ పడి రచ్చ చేసుకున్నంత మాత్రానే గట్టిగా ఉన్నట్లు కాదు. మంచితనం బలహీనత కాదు... కాళేశ్వరం ప్రాజెక్టు గత అయిదేళ్లలోనే నిర్మించారు కదా. పాలమూరు-రంగారెడ్డి అప్పుడే ప్రారంభించారు కదా.. రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి మెలసి ఉండాలన్నదే మా సీఎం ఆకాంక్ష’ అని వివరించారు.

ఇదీ చదవండి: Nara lokesh: సీఎం జగన్ చరిత్రలో రికార్డుకెక్కారు: లోకేశ్

Last Updated : Jun 22, 2021, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.