'ఎక్కడి వారు అక్కడే ఉండండి'.. వలస కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న మార్గదర్శకాలివి. వలసకూలీలను ఆదుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కేంద్రం సూచిస్తోంది. వలస కూలీలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా.. సొంత ఊళ్లకు వెళ్లిపోవాలన్న భావనతో.. వందల కిలోమీటర్ల దూరం కాలినడకనే పయనమవుతున్నారు. లాక్డౌన్ వల్ల ఆకలి తీర్చుకోవడానికి కనీసం టిఫిన్ సెంటర్లు కూడా లేకపోవటం వల్ల ఆకలితోనే మూటలు నెత్తిన పెట్టుకుని పిల్లలతో రోడ్లు పట్టుకుని కిలోమీటర్ల మేర నడుస్తున్నారు. వలస కూలీల వ్యథను చూసి కొందరు దాతలు ఆహారం అందిస్తూ, విశాంత్రి తీసుకోడానికి ఆవాసం కల్పిస్తున్నారు.
ప్రభావ ప్రాంతాల్లో పయనం
వలస కూలీలు వందల కిలోమీటర్లు నడుస్తూ... రాత్రిళ్లు రోడ్లపైనే సేద తీరుతున్నారు. సొంత ఊళ్లకు వెళ్తున్న వీరంతా.. కొన్నిసార్లు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే తప్పక విశ్రమిస్తున్నారు. సామాజిక దూరం పాటించకుండా, మాస్కులు లేకుండానే వీరి ప్రయాణాలు సాగుతున్నాయి.
ఉత్తర్ప్రదేశ్ వాసులు విజయవాడలో..
రాష్ట్రం నుంచి ఉత్తర్ ప్రదేశ్ వెళ్తున్న 22 మంది వలసకూలీలను విజయవాడ పోలీసులు అడ్డుకున్నారు. ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు వారిని విజయవాడ రథం సెంటర్ సమీపంలో గల దర్గా వద్ద నిలువరించారు. లాక్డౌన్తో సొంత ప్రాంతానికి వెళ్లేందుకు నాలుగు రోజుల నుంచి నడుస్తూ అన్ని జిల్లాల చెక్ పోస్టులను దాటుకుని కాలినడకన వీరు విజయవాడకు చెరుకున్నారు. ఐజీ సత్యనారాయణ, 1వ పట్టణ సీఐ వెంకటేశ్వర్లు వీరికి భోజనాలు ఏర్పాటుచేశారు. తర్వాత వారిని ప్రశాంతినగర్‌లోని బీసీ సంక్షేమ వసతి గృహానికి తరలించారు.
ఇదీ చదవండి: