ETV Bharat / city

కల్తీ నూనెల వేపుడు, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం - ఏపీ తాజా వార్తలు

ADULTERATED OILS IN AP రాష్ట్రంలో ప్రజల ఆహారపుటలవాట్లు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ బారిన పడి, ఉపశమనం పొందిన వారిలో చాలామందికి రుచి సరిగా తెలియడం లేదు. దాంతో నూనెలను అధికంగా వాడే వంటకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వేయించిన పదార్థాల కోసం హోటళ్లను ఆశ్రయించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇదే అదనుగా కొన్ని చోట్ల వంట నూనెల్లో కల్తీ జరుగుతోంది. ఈ పరిణామం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది సేకరించిన నూనెల నమూనాల ఫలితాలను పరిశీలించగా విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి.

ADULTERATED OILS
ADULTERATED OILS
author img

By

Published : Aug 21, 2022, 7:54 AM IST

ADULTERATED OILS విదేశాల నుంచి వచ్చే నూనెను మన రాష్ట్రంలోని రీప్యాకింగ్‌ సంస్థలు ప్యాకెట్లు, డబ్బాల రూపంలో మార్చి, మార్కెటింగ్‌ చేస్తున్నాయి. ఇలాంటి పరిశ్రమలు ఎక్కువగా నరసరావుపేట, కడప, కర్నూలు, కాకినాడ, అనంతపురంతో పాటు మరికొన్ని చోట్ల కేంద్రీకృతమయ్యాయి. వినియోగదారులతోపాటు చిరువ్యాపారులకు విక్రయిస్తున్న కొన్ని నూనెల్లో కల్తీ అధికంగా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఒకటి నుంచి 14 వరకు రాష్ట్రంలోని రీప్యాకింగ్‌, లోకల్‌ బ్రాండ్ల పరిశ్రమల నుంచి 155 నమూనాలను సేకరించారు. వీటిలో 10% నూనెలో నాణ్యత లేదని రిపోర్టులు వస్తున్నాయని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జగదీశ్వరి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో 680 నమూనాలను పరీక్షిస్తే 66 కేసుల్లో నాణ్యత లేదని తేలింది.

వేరుసెనగ, కొబ్బరి, పొద్దుతిరుగుడు..
సాధారణంగా రాష్ట్రంలో వేరుసెనగ, కొబ్బరినూనె, పొద్దుతిరుగుడు నూనెలను అధికంగా వాడుతున్నారు. వీటి ధరలూ ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు రకాల నూనెల్లోనే కల్తీ ఎక్కువగా జరుగుతోంది. ధర తక్కువగా ఉండే పామోలిన్‌ నూనెను కలుపుతున్నారని ఫుడ్‌ సేఫ్టీ అధికారి ఒకరు తెలిపారు. వేరుశెనగ నూనెలో... పామోలిన్‌, సూపర్‌వోలిన్‌ (పామోలిన్‌ను రిఫైన్డ్‌ చేస్తే వచ్చేది), రిఫైన్డ్‌ కాటన్‌ సీడ్‌ ఆయిల్‌ (పత్తి విత్తనాల నుంచి తయారు చేసేది)ను కలిపేస్తున్నారు.

పొద్దుతిరుగుడు నూనెలోనూ పామోలిన్‌, రిఫైన్డ్‌కాటన్‌ సీడ్‌ ఆయిల్‌ మిశ్రమం చేస్తున్నారు. కొబ్బరి నూనెలోనూ పామోలిన్‌ కలుపుతున్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల హోటళ్లు, టిఫెన్‌ సెంటర్లు, బజ్జీల కొట్లు, నూడుల్స్‌, గోబీ సెంటర్లు, చికెన్‌ బిర్యానీ విక్రయ కేంద్రాల్లో ఇలాంటి నూనెల వాడకం ఎక్కువగా ఉంది. ఒకసారి వాడిన నూనె మరోసారి వాడకూడదు. కానీ... చిరు వ్యాపారుల్లో కొందరు ఆర్థిక పరిస్థితులు, స్వలాభం కోసం పదేపదే ఆయిల్‌ను వేడి చేస్తూ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఈ చర్యలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి.

చిరు వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నాం: జె.నివాస్‌, కమిషనర్‌, రాష్ట్ర ఆహార భద్రత, కుటుంబ సంక్షేమ శాఖల కమిషనర్‌

కల్తీ నూనె నిరోధానికి... ఒకసారి వాడిన నూనెను మరోసారి వాడకుండా ఉండేందుకు చిరు వ్యాపారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక చర్యలూ తీసుకుంటున్నాం. అందులో భాగంగానే రాష్ట్రంలో ఇటీవల 155 నమూనాలను రీప్యాకింగ్‌, లోకల్‌ బ్రాండ్ల పరిశ్రమల నుంచి సేకరించాం. నివేదికలు రావాల్సి ఉంది. ప్రజలు కూడా ఆహార పదార్థాల నాణ్యతపై తయారీదారుల వద్ద ఆరా తీస్తుంటే వారిలో మార్పు వస్తుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.