ETV Bharat / city

nara lokesh on ycp: రివర్స్‌ పాలనతో మొదలుపెట్టి రివర్స్‌ కేసులుపెట్టేవరకు వైకాపా వచ్చింది: లోకేశ్‌

రివ‌ర్స్ పాల‌నతో జగన్‌(cm jagan) రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(nara lokesh) ధ్వజమెత్తారు. రివర్స్‌ పాలనతో మొదలుపెట్టి రివర్స్‌ కేసులవరకూ జగన్‌ ప్రభుత్వం వచ్చిందని మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యే జోగి ర‌మేశ్​, ఆయన గూండాల అకృత్యాలను ప్రపంచమంతా చూసిందన్నారు.

నారా లోకేశ్‌
నారా లోకేశ్‌
author img

By

Published : Sep 19, 2021, 8:42 AM IST

సీఎం జగన్‌(cm jagan) తొలుత రివర్స్​ పాలనతో మొదలుపెట్టి.. రివర్స్‌ టెండర్‌లను దాటుకుని ఇప్పుడు రివర్స్‌ కేసుల వరకూ వచ్చారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(nara lokesh) ధ్వజమెత్తారు. జెడ్‌ప్లస్ భ‌ద్రత ఉన్న చంద్రబాబుపై దాడి చేసేందుకు పోలీసులు సాయంతో ఇంట్లోకి చొర‌బ‌డిన‌ వైకాపా ఎమ్మెల్యే జోగి ర‌మేష్(mla jogi ramesh), ఆయన గూండాల అకృత్యాలను ప్రపంచమంతా చూసిందని తెలిపారు. బాధితులైన‌ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే రివర్స్‌గా వారిపైనే జగన్‌ సర్కార్‌ కేసులు పెట్టిందని... వైకాపా ప్రభుత్వం ఆయుధమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, నాన్‌ బెయిల్‌ కేసులనే అస్త్రాలు ప్రయోగించిందని ఆరోపించారు.

నిందితుడు జోగి ర‌మేష్‌కి స్టేష‌న్ బెయిల్ రేంజు కేసు పెట్టి రివ‌ర్స్ పోలీసింగ్‌ అంటే ఏంటో చూపించారని విమర్శించారు. బాధితుల్ని బంధిస్తూ, ముద్దాయిల్ని ముద్దుగా చూసుకుంటునన్న వైకాపా అధికారులు రెండున్నరేళ్లలోనే రిటైర్‌ అయిపోరు కదా అని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి..

CASE ON TDP LEADERS : తెదేపా నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.