ముస్లిం శ్మశానవాటికలో వైకాపా నేతల మట్టి తవ్వకాలను ప్రశ్నించటమే హనీఫ్ చేసిన తప్పా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. వైకాపా దురాగతాలకు రాష్ట్రంలో రోజుకో ముస్లిం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండటం దారుణమని మండిపడ్డారు. నంద్యాలలో సలాం కుటుంబ ఆత్మహత్య ఘటన మరువక ముందే గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన మౌజాం షేక్ హనీఫ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్మశానవాటికలో మట్టి తవ్వకాన్ని ప్రశ్నించినందుకు పదిమంది ముందు దాడి చేసి, తిడుతూ అవమానిస్తారా అని ధ్వజమెత్తారు. ఆయన ప్రాణాలు పోయి ఉంటే ఆ కుటుంబానికి జవాబుదారీ ఎవరని ప్రశ్నించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించిన ఆయన... ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యాయత్నానికి ముందు హనీఫ్ తీసుకున్న సెల్ఫీ వీడియోను లోకేశ్ తన ట్విట్టర్‌కు జత చేశారు.
ఇదీ చదవండి: