ETV Bharat / city

Lokesh: 'ఆ కుటుంబంలో ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం జరిగినా సీఎందే బాధ్యత' - అక్బరా బాషా కుటుంబం తాజా వార్తలు

ఆత్మహత్యాయత్నం చేసిన అక్బర్ బాషా కుటుంబంలోని ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం జరిగినా సీఎం జగన్ బాధ్యత వహించాలని తెదేపా నేత నారా లోకేశ్ డిమాండ్ చేశారు. బాషా భూమి తిరిగిచ్చేశామని, వివాదం సమసిపోయిందని జగన్ బృందం నమ్మించి మోసం చేశారని..దానిని తట్టుకోలేకనే అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందన్నారు.

ఆ కుటుంబంలో ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినా సీఎందే బాధ్యత

author img

By

Published : Sep 21, 2021, 4:45 PM IST

పోలీసులు పులివెందుల ఫ్యాక్షన్ ముఠా సభ్యుల్లా వ్యవహరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ కోసం ఇంకెంతమంది మైనార్టీలను బలిగొంటారని నిలదీశారు. ఆత్మహత్యాయత్నం చేసిన అక్బర్ బాషా కుటుంబంలోని ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం జరిగినా.. సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి అక్బర్ బాషా భూమిని కబ్జా చేస్తే..ఎన్​కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించటం దారుణమని మండిపడ్డారు. బాషా భూమి తిరిగిచ్చేశామని.., వివాదం సమసిపోయిందని జగన్ బృందం నమ్మించి మోసం చేశారన్నారు. బాషా కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

  • అక్బర్ కుటుంబంలో ఏ ఒక్కరి ప్రాణాలకి ప్రమాదం ఏర్పడినా సీఎం బాధ్యత వహించాలి. సీఎం బంధువుల కబ్జాలకు అండగా నిలిచి మైనారిటీ కుటుంబానికి అన్యాయం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి.(3/4)

    — Lokesh Nara (@naralokesh) September 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

కర్నూలు: చాగలమర్రిలో అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.