శాసనసభలో ప్రజాసమస్యలు ప్రస్తావించకుండా.. అదేపనిగా తనను తిట్టే పనిలో అధికార పార్టీ సభ్యులు నిమగ్నమయ్యారని తెదేపా నేత లోకేశ్ మండిపడ్డారు. వాళ్లు తనను చూసి భయపడుతున్నట్లు తెలుస్తోందన్నారు. తన తల్లిని దూషిస్తే.. ముఖ్యమంత్రి, సభాపతి వికటాట్టహాసం చేస్తున్నారని, ఇది సరైంది కాదని దుయ్యబట్టారు. సభలో లేని వారి గురించి ప్రస్తావిచటం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తానేది మర్చిపోలేదని.. అన్నీ గుర్తు పెట్టుకొని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని అన్నారు.
కల్తీ సారా మరణాలపై న్యాయ పోరాటం: కల్తీ సారా మరణాలు, మధ్య నిషేధంపై సభలో చర్చ జరగాలని తాము డిమాండ్ చేస్తుంటే.. ముఖ్యమంత్రి జగన్ సభకు రాకుండా మంత్రి ద్వారా స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. నాటుసారా మరణాలపై చర్చించకుండా పెగాసస్‌పై చర్చిస్తున్నారని ధ్వజమెత్తారు. కల్తీసారా మరణాలపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: వైకాపా ఎమ్మెల్యే అమర్నాథ్పై.. పరువు నష్టం దావా వేస్తా: ఏబీవీ