రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేత సమయాన్ని రాత్రి 9 గంటల వరకు పొడిగిస్తూ ఆబ్కారీ శాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉంచాలని పేర్కొన్నారు. అయితే మద్యం విక్రయాలు అనంతరం నగదును లెక్కించేందుకు, దాన్ని ప్రభుత్వానికి అదే రోజు జమ చేసేందుకు అదనంగా మరో గంటను కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 8 గంటలకే విక్రయాలు ముగిసినప్పటికీ నగదు లెక్కింపు కోసం మరికొంత సమయం పడుతున్నందున ఈ వెసులుబాటు కల్పిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మెమో జారీ చేశారు.
ఇదీ చదవండి: శిరోముండనం చేసిన యువకుడిని.. ఆ రోజు రాత్రి ఇలా కొట్టారా?