ఆత్మీయతే ఆయుధంగా ఎర్రన్నాయుడు(Errannaidu) రాజకీయాల్లో అందరి మనసులు గెలుచుకున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(chandrababu) కొనియాడారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎర్రన్నాయుడు 9వ వర్ధంతి సంద్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. చంద్రబాబుతో పాటు సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనగాని సత్యప్రసాద్, ఆలపాటి రాజా, అశోక్ బాబు, మంతెన సత్యనారాయణ రాజు, బీదా రవిచంద్రయాదవ్, కూన రవికుమార్, బీసీ జనార్థన్ రెడ్డి, ఎంఎస్ రాజు, డూండీరాకేశ్, నరసింహ ప్రసాద్, గురుమూర్తి, దారపనేని నరేంద్ర, కుమారస్వామి తదితరులు పూలు చల్లి నివాళులర్పించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి, కేంద్రమంత్రిగా ప్రజలకు ఎర్రన్నాయుడు చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. దిల్లీలోని పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నానిలు ఎర్రన్నాయుడు చిత్రపటానికి నివాళులర్పించారు.
-
కల్మషం లేని చిరునవ్వుతో ఆత్మీయతే ఆయుధం అన్నట్టుగా రాజకీయ రంగంలో అందరి మనసులను గెలుచుకున్న మంచి మనిషి, నాకు ఆప్తుడు అయిన కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా... ఆ ఆదర్శ ప్రజానాయకుడి స్మృతికి నివాళులర్పిస్తున్నాను pic.twitter.com/MsLelYVQzd
— N Chandrababu Naidu (@ncbn) November 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">కల్మషం లేని చిరునవ్వుతో ఆత్మీయతే ఆయుధం అన్నట్టుగా రాజకీయ రంగంలో అందరి మనసులను గెలుచుకున్న మంచి మనిషి, నాకు ఆప్తుడు అయిన కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా... ఆ ఆదర్శ ప్రజానాయకుడి స్మృతికి నివాళులర్పిస్తున్నాను pic.twitter.com/MsLelYVQzd
— N Chandrababu Naidu (@ncbn) November 2, 2021కల్మషం లేని చిరునవ్వుతో ఆత్మీయతే ఆయుధం అన్నట్టుగా రాజకీయ రంగంలో అందరి మనసులను గెలుచుకున్న మంచి మనిషి, నాకు ఆప్తుడు అయిన కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా... ఆ ఆదర్శ ప్రజానాయకుడి స్మృతికి నివాళులర్పిస్తున్నాను pic.twitter.com/MsLelYVQzd
— N Chandrababu Naidu (@ncbn) November 2, 2021
ఇదీ చదవండి : Kodali nani: 'పవన్‌కు ధైర్యముంటే..ప్రధాని మోదీకి డెడ్‌లైన్ పెట్టాలి'