నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజక వర్గంలోని పుత్తూరు, విజయపురం మండలాల్లో వైఎస్సార్ కాలనీ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేతో పాటు అధికారులు, వైకాపా కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
కృష్ణాజిల్లాలో..
విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో వైఎస్సార్ కాలనీల ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శంకుస్థాపన చేశారు. రాబోయే కాలంలో జగనన్న కాలనీలు ఓ పచ్చటి తోరణాలతో మోడల్ కాలనీలుగా మారతాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సుమారు నాలుగువేల ఇళ్లకు శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు.
గన్నవరం నియోజకవర్గం.. నున్నా ప్రసాదంపాడు, రామవరప్పాడు ప్రాంతాలకు చెందిన పేద ప్రజలకు ఇవ్వనున్న జగనన్న కాలనీల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పాల్గొన్నారు. జగనన్న కాలనీలు మోడల్ గ్రామాలుగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'సీఎం జగన్పై చేస్తున్న కుట్రలను సమర్ధంగా ఎదుర్కోవాలి'