ETV Bharat / city

కేటీఆర్ ఆదేశంతో రంగంలోకి ఎస్డీఆర్‌ఎఫ్‌... నదిలో చిక్కుకున్న ఇద్దరు సురక్షితం -

వరుసగా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. లోతట్టు ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా సోమనపల్లిలో ఇద్దరు రైతులు పశువుల కోసం వెళ్లి వరదలో చిక్కుకున్నారు. వారిని హెలికాఫ్టర్​ ద్వారా రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

1
1
author img

By

Published : Jul 14, 2022, 4:24 PM IST

Two person rescued: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఓడ్డు సోమనపల్లిలో వాటర్‌ట్యాంకు మీద చిక్కుకుపోయిన ఇద్దరు రైతులను ప్రభుత్వ విపత్తు నిర్వహణ యంత్రాంగం రక్షించింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హెలికాప్టర్ తెప్పించి.. వారి ప్రాణాలను కాపాడారు.

తమ పశువుల కోసం నిన్న సాయంత్రం ఆ ఇద్దరు రైతులు పొలాల వద్దకు వెళ్లగా తిరుగు ప్రయాణంలో గోదావరి నది ప్రవాహం చుట్టు ముట్టింది. దీంతో బయటకు రాలేక వాటర్‌ట్యాంకు ఎక్కి ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అక్కడ చేరుకున్న ఎమ్మెల్యే... కేటీఆర్‌కు విషయం తెలిపారు. ఆయన ఆదేశంతో ప్రభుత్వ విపత్త నిర్వహణ యంత్రంగం.. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌ను రప్పించి ఇద్దరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రైతులను రక్షించినందుకు గ్రామస్థులు ప్రజలు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

నదిలో చిక్కుకున్న ఇద్దరు సురక్షితం

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.