ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అన్నట్లు చంద్రబాబు పాలన సాగితే.... అప్పులు, పార్టీ సేవ అన్న రీతిలో జగన్ పాలన సాగుతోందని తెదేపా నాయకురాలు కోట్ల సుజాతమ్మ ఆరోపించారు. ఎవరి దగ్గర ఎంత కమిషన్‌లు నొక్కేయచ్చన్న ఆలోచనలతోనే ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. పోలవరం నిధుల్ని నవరత్నాలకు మళ్లీంచారని ఆరోపించారు.
క్యూసెక్కులకు, టీఎంసీలకు తేడా తెలియనివారు మంత్రులుగా పనిచేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. అధికారం కోసం 400 హామీలిచ్చిన జగన్... వాటిలో ఎన్ని పూర్తి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంపాదనే తప్ప వైకాపా నేతలకు ప్రజల బాగోగులు పట్టట్లేదని దుయ్యబట్టారు. పాలన చేతకాదని ఇకనైనా ఒప్పుకోవాలని లేకపోతే ప్రజలు బుద్ధిచెప్పే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరించారు.
ఇదీచదవండి