ఆంధ్రప్రదేశ్ టూరిజం హబ్‌గా మారేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని..ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. దిల్లీలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, పశుపతి పరాస్ పాశ్వన్‌తో.. ఉపసభాపతి భేటీ అయ్యారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ఏపీ ఇస్తున్న ప్రాధాన్యం గుర్తించి..కేంద్ర పథకాలు యథాతథంగా కొనసాగించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని..కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారని చెప్పారు.
ఏపీలో పర్యటక, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి కృషి చేయాలని కిషన్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. ఆగస్టు 6, 7 తేదీల్లో ఏపీకి వస్తానని కిషన్‌రెడ్డి తెలిపినట్లు కోన రఘుపతి వెల్లడించారు. మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని ఉపసభాపతి అన్నారు.
ఇదీ చదవండి
Kondapalli: కొండపల్లికి వెళ్లకుండా.. తెదేపా నేతల అరెస్ట్.. బలవంతంగా తరలింపు