కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకుందామని విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ముస్లిం సోదరులకు విజ్ఞపి చేశారు. కేశినేని భవన్లో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఇమామ్, మోజన్లకు దుస్తులు,బియ్యం,నిత్యావసరాలు, బలవర్ధక ఆహార పదార్దాలు పంపిణీ చేశారు. ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో నెలరోజుల పాటు రోజంతా ఉపవాసం ఉండి, ఐదుపూటలా నమాజ్ చేస్తూ భక్తిశ్రద్ధలతో గడిపే మాసం అలాంటి రంజాన్ మాసం లాక్ డౌన్ కారణంగా బోసిపోయిందని కేశినేని శ్వేత అన్నారు. 45 రోజులుగా అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా నిత్యావసరాలు అందిస్తున్నామన్నారు.
ఇవీ చదవండి: నిద్రిస్తున్న కూలీలపై దూసుకెళ్లిన రైలు..16 మంది దుర్మరణం