ETV Bharat / city

కెలికి కయ్యం పెట్టుకుంటోంది... ఏపీపై మరోసారి కేసీఆర్ ఆగ్రహం‌

నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్​ తీరు సరిగా లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే కయ్యం పెట్టుకుంటోదని ఆరోపించారు. ఏపీ వాదనలకు అపెక్స్​ కౌన్సిల్ భేటీలో దీటైన సమాధానం ఇవ్వాలని అధికారులకు సూచించారు. కేంద్రం వైఖరినీ ఎండగట్టాలని... న్యాయమైన డిమాండ్లు దేశానికి తెలియజేయాలని అభిప్రాయపడ్డారు.

నదీజలాలపై ఏపీ కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటోంది: కేసీఆర్‌

author img

By

Published : Sep 30, 2020, 4:07 PM IST

Updated : Sep 30, 2020, 4:35 PM IST

అపెక్స్ కౌన్సిల్‌ సమావేశంపై రేపు మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. నీటిపారుదలశాఖ అధికారులతో ప్రగతిభవన్‌లో భేటీ అవుతారు. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో చర్చిస్తారు. నీటిపారుదలశాఖ వివరాలు, కేంద్రానికి చెప్పాల్సిన అంశాలను తీసుకుని రావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్​ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజానిజాలను తేటతెల్లం చేయాలి..

నదీజలాలపై ఏపీ కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటోందని... ఏపీ వాదనలకు అపెక్స్ కౌన్సిల్ భేటీలో దీటుగా జవాబు చెప్పాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా కుండబద్ధలు కొట్టినట్లు నిజాలు చెప్పాలని అధికారులకు సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఏడేళ్ల అలసత్వాన్ని తీవ్రంగా ఎండగట్టాలన్నారు. ప్రజల హక్కులను హరించేందుకు జరుగుతున్న యత్నాన్ని ప్రతిఘటించాలని చెప్పారు. నిజానిజాలను యావత్ దేశానికి తేటతెల్లం చేయాలన్నారు.

కేంద్ర వైఖరిని ఎండగట్టాలి..

జూన్ 14న ప్రధానికి లేఖ రాశామని, నీటి కేటాయింపు జరపాలని కోరామన్నారు. ప్రధానికి రాసిన లేఖకు ఇప్పటికీ స్పందన లేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అపెక్స్ భేటీ పేరుతో ఏదో చేస్తున్నట్లు అనిపిస్తున్నా.. ఏమీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్రం వైఖరిని గట్టిగా ఎండగట్టాలన్నారు. తెలంగాణాకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్​ ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై వచ్చే నెల 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.

ఇవీ చూడండి:

6న అపెక్స్​ కౌన్సిల్ సమావేశం.. జల వివాదాలపై చర్చ​

Last Updated : Sep 30, 2020, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.