ETV Bharat / city

'ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు' - eduction news in ap

రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థి సీటు ఖాళీ అయితే అదే కేటగిరీ వ్యక్తితో మాత్రమే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య అన్నారు.

justice v.eswaryya
జస్టిస్ వి.ఈశ్వరయ్య
author img

By

Published : May 30, 2020, 9:47 PM IST

జస్టిస్ వి.ఈశ్వరయ్య

మెరిటోరియస్‌ రిజర్వ్‌డ్‌ అభ్యర్ధితో భర్తీ అయిన సీటు ఖాళీ అయితే అదే కేటగిరీకి చెందిన అభ్యర్ధి ద్వారా మాత్రమే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ జీవో 57 జారీ చేయడం వల్ల.... ఆయా వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య తెలిపారు. తాడేపల్లిలోని ఉన్నత విద్యా కమిషన్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏడేళ్లుగా నష్టపోతున్న ఆయా వర్గాలకు తాజా ఉత్తర్వులతో ఉపశమనం లభించినట్లు అయ్యిందన్నారు. ఈ ఏడాది వైద్య సీట్లలో 159 మందికి రిజర్వేషను సీట్లు ఆయా వర్గాలకే కేటాయించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుందన్నారు.

1. క్రాప్ హాలిడే తరహాలో ఆంధ్రప్రదేశ్​లో ప్రైవేట్​ మెడికల్ మరియు డెంటల్ కాలేజీల్లో ఈ ఏడాది పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు నిలిపివేస్తున్నామని మేనేజ్​మెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది.

2. ఆంధ్రప్రదేశ్​లో ప్రయివేట్ మెడికల్ మరియు డెంటల్ పీజీ కోర్సులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే మెడికోలకు ఇవ్వవలసిన స్టయిఫండ్​లే ఎక్కువగా వున్నాయని మేనేజిమెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది.

3. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్​లో ప్రైవేట్​ మెడికల్ కాలేజీలన్నీ కోవిడ్ హాస్పిటల్స్​గా మారిపోయి ఆదాయాలు లేక డాక్టర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో వున్నాయి. పీజీ కోర్సుల ఫీజులను 70 శాతం తగ్గించేశారు. ఈ స్థితిలో టీచింగ్ హాస్పిటల్స్ ను నిర్వహించ లేనందున పీజీ కోర్సుల్లో అడ్మిషన్లను నిలిపి వేస్తున్నట్టు మేనేజిమెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది.

4. జీతాలు ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగిపోగా ఉన్న ఫీజులనే ప్రభుత్వం 70 శాతం తగ్గించడం వల్ల కోర్సులను కొనసాగించడం సాధ్యం కానందున మెడికల్ పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రయివేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ మేనేజిమెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది.

ఇవీ చదవండి: ఏడాది పాలనలో ఎవరికేం ఒరగబెట్టారని ఉత్సవాలు?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.