ETV Bharat / city

JP NADDA: ఆ పథకం జగన్​ది కాదు.. మోదీదే..! - భాజపా శక్తి కేంద్ర ప్రముఖ్‌ల సమ్మేళనంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

JP NADDA: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బృహత్తర ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని జగన్‌రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరుతో ప్రచారం చేసుకుంటోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ జగన్‌ పథకం కాదని, ప్రధాని నరేంద్ర మోదీదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన మొదలు అన్ని పథకాల పేర్లు మార్చి.. సొంతవిగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

JP NADDA
ఆరోగ్య పథకం మోదీదే.. ‘ఆయుష్మాన్‌ భారత్‌’కే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పేరు
author img

By

Published : Jun 7, 2022, 8:09 AM IST

JP NADDA: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బృహత్తర ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని జగన్‌రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరుతో ప్రచారం చేసుకుంటోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం ఆయన విజయవాడలో భాజపా శక్తి కేంద్ర ప్రముఖ్‌ల సమ్మేళనంలో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ జగన్‌ పథకం కాదని, ప్రధాని నరేంద్ర మోదీదని స్పష్టం చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌తో రూ.5 లక్షల వరకు వైద్య సాయం అందుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ పథకం దేశంలో ఎక్కడైనా పనిచేస్తుందని, ఇక్కడ నుంచి హైదరాబాద్‌ వెళ్తే ఆరోగ్యశ్రీ పనిచేయదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన మొదలు అన్ని పథకాల పేర్లు మార్చి.. సొంతవిగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విజయాలు, జిల్లాల వారీగా రాష్ట్రంలో కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, జరిగిన అభివృద్ధిపై పార్టీ ముద్రించిన పుస్తకాన్ని ఇంటింటికీ పంచి ప్రజల కోసం కేంద్రం ఏం చేసిందో వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో పాటు కొన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయని నడ్డా విమర్శించారు. ‘మోదీ ప్రధాని అయ్యాక దేశవ్యాప్తంగా కుటుంబ రాజకీయాలపై భాజపా పోరాడుతోంది. రాష్ట్రంలో తెదేపా, వైకాపావి కుటుంబ రాజకీయాలే. పంజాబ్‌, యూపీ, బిహార్‌, బెంగాల్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, కర్ణాటకలలో ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణలో కేసీఆర్‌ పార్టీ ఓ కుటుంబానిదే. ఈ పార్టీల్లోకి మనవళ్లు, మనవరాళ్లు కూడా రావొచ్చు’ అని ఎద్దేవా చేశారు.

కార్యకర్తల ఇళ్లపై భాజపా జెండాలు..

కార్యకర్తల ఇళ్లపై భాజపా జెండాలు రెపరెపలాడాలని నడ్డా పిలుపునిచ్చారు. ‘మీరే కార్యక్షేత్ర యోధులు. మీపైనే పార్టీ పురోగతి ఆధారపడి ఉంది. పార్టీని ఏపీలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రతిజ్ఞ చేయాలి. బూత్‌ కమిటీ వారు రోజూ ఐదుగురు కొత్తవారిని కలుసుకోవాలి. భాజపా అన్ని వర్గాల పార్టీ అనే భావన వచ్చేలా పని చేయాలి. రాష్ట్రంలో పదివేలకు పైగా శక్తి కేంద్రాలున్నాయి. మిగిలిన 2,500 కేంద్రాలను రెండు నెలల్లో ఏర్పాటు చేయాలి’ అని సూచించారు.

అర్జునుడు తపస్సు చేసిన భూమి విజయవాడ

చారిత్రకంగా, సాంస్కృతికంగా విజయవాడకు మంచి స్థానం ఉందని నడ్డా వ్యాఖ్యానించారు. అర్జునుడు ఇక్కడే తపస్సు చేశారన్నారు. సాంస్కృతిక రాజధానిగా ఉన్న విజయవాడలో తెలుగును స్వచ్ఛంగా ఉచ్చరిస్తారని తెలిపారు. విజయం దిశగా వెళ్లేందుకు జరుగుతున్న ఈ సభ విజయవాడలోనే జరుగుతుండటం సంతోషకరమన్నారు. ఏపీ నుంచే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత పదవిని అలంకరించారని నడ్డా గుర్తుచేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్‌కుమార్‌ యాదవ్‌ను సభకు పరిచయం చేసి, ఆయనను గెలిపించాలని కోరారు.

రివర్స్‌లో రాష్ట్రాభివృద్ధి: పురందేశ్వరి

రాష్ట్ర మంత్రుల బస్సు యాత్రకు ఎదురైన వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అమలాపురం ఘటనను తెరపైకి తెచ్చారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ‘జగన్‌ ప్రభుత్వ అప్పులపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. రివర్స్‌ టెండరింగ్‌ అమల్లోకి తెచ్చి.. రాష్ట్రాభివృద్ధిని రివర్సులో ఉంచుతున్నారు. రాష్ట్రంలో స్కాం.. స్కాం.. అంటుంటే, కేంద్రంలో స్కీం.. స్కీం అంటున్నారు’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భాజపా పోరాడుతోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఎమ్మెల్సీ మాధవ్‌ మాట్లాడుతూ.. భాజపాపై అధికార పక్షం, విపక్షం దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. భాజపా పట్ల ప్రజల్లో అపోహలు పెంచేందుకు వైకాపా చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ నాయకుడు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఐవైఆర్‌ కృష్ణారావు మాట్లాడుతూ.. విభజన హామీల అమలు దగ్గర నుంచి ప్రతి విషయంలో భాజపాపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. వీటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు పార్టీ ముద్రించిన పుస్తకంలోని విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.