ETV Bharat / city

నేటి నుంచే జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు - Telangana news

జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్​లైన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 18 వరకు కొనసాగనున్నాయి. దేశవ్యాప్తంగా 331 నగరాలు, పట్టణాల్లో... ఏపీలో 20, తెలంగాణలో 11 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు.

JEE Main second phase online exams
జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్​లైన్ పరీక్షలు
author img

By

Published : Mar 16, 2021, 12:58 PM IST

జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్​లైన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు ఆరున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షా 10 వేల మంది హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా 331 నగరాలు, పట్టణాల్లో... ఏపీలో 20, తెలంగాణలో 11 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఏపీ, తెలంగాణలో...

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్​నగర్, నల్గొండ, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

కరోనా డిక్లరేషన్...

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్షలు ఉంటాయి. పరీక్ష సమయానికి అరగంట ముందే కేంద్రంలో ఉండాలని ఎన్​టీఏ స్పష్టం చేసింది. ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు, మధ్యాహ్నం రెండు నుంచి రెండున్నర వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. విద్యార్థులు తమకు కరోనా లేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి విడత జేఈఈ మెయిన్ గత నెల 23 నుంచి 26 వరకు జరిగాయి. ఏప్రిల్, మే నెలలో కూడా నిర్వహించి నాలుగింటిలో అత్యుత్తమ స్కోరు ఆధారంగా ర్యాంకు ఖరారు చేస్తారు.

ఇవీ చూడండి:

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు.. ఈ నెల23న విచారణకు హాజరుకావాలని ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.