ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడలో ఎస్ఈసీ కార్యాలయానికి వచ్చిన ఆయన... ఈ మేరకు వినతిపత్రాన్ని అందించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, రిటర్నింగ్ అధికారులు తమ పైన ఉన్నవారికి భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల వాయిదా గురించి తాను పెద్దగా మాట్లాడబోనని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: 'దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై కేంద్రం జోక్యం చేసుకోవాలి'