ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వాహనమిత్ర పథకానికి ముఖ్యమంత్రి జగన్ గాలి తీసి తుస్సుమనిపించారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏదో ఒక సాకుతో వాహనమిత్ర లబ్ధిదారులను తొలగించి నామమాత్రపు పథకంగా అమలుచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక నుంచి కుటుంబానికి ఏవైనా ఒక పథకమే అమలయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నారని.. అందులో భాగమే వాహనమిత్ర పథకంలో లబ్ధిదారుల తొలగింపు అని ఆరోపించారు. వాహనమిత్ర పథకానికి దేవాదాయశాఖ నిధులను మళ్లించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కుటుంబానికి ఒక పథకం కాకుండా అర్హులైన అందరికీ ఎలాంటి షరతులు లేకుండా... నవరత్నాల్లోని అన్ని పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... MP RRR: ఏపీ అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది: ఎంపీ రఘురామ