JANASENA FOCUS ON APPLICATIONS: "జనవాణి – జనసేన భరోసా" కార్యక్రమం ద్వారా పవన్ కల్యాణ్ గత రెండు విడతల్లో స్వీకరించిన అర్జీలను పరిశీలించి, వాటిపై లేఖలు రాసే ప్రక్రియ ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, వాటి పరిష్కారాలకు సంబంధించిన కార్యాచరణపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి, పార్టీ నాయకులు డి.వరప్రసాద్ నేతృత్వంలో వచ్చిన అర్జీలను శాఖల వారీగా విభజించారు. అనంతరం వాటిని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు వారి సమస్యలను తెలియజేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఇందుకోసం ప్రత్యేక బృందం పని చేస్తుందని.. ప్రతి అర్జీ సమస్యను పరిష్కరించే దిశగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ ప్రతి సమస్యనూ సమీక్షించి, స్వయంగా సంబంధిత శాఖలకు లేఖలు రాస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఇవీ చదవండి: