మూడు రాజధానుల అంశంపై రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రతినిధులతో ఆదివారం జనసేనాని పవన్ అత్యవసర సమావేశం కానున్నారు. రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన పరిస్థితుల్లో భవిష్యత్ కార్యాచరణ, 3 రాజధానులపై టెలీకాన్ఫరెన్స్‌లో నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు. అమరావతి రైతులకు జనసేన తరఫున ఎలా అండగా ఉండాలన్న దానిపై చర్చ జరగనుంది. భవిష్యత్ కార్యాచరణపై జనసేన రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: విశాఖలో పోలీసుల భద్రత, మౌలిక సదుపాయాలపై కమిటీ ఏర్పాటు