లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిని తక్షణమే క్వారంటైన్‌కు పంపించాలని జనసేన నేత పోతిన మహేశ్ డిమాండ్ చేశారు. విజయవాడ భవానిపురంలో స్థానిక పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన ఆయన... లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి విజయసాయి రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువున్నాయని చూపుతున్నారన్నారు. రాజధాని తరలిద్దామనుకున్న విశాఖలో మాత్రం కరోనా కేసులు తక్కువ చేసి చూపుతూ... తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు.
'ఎంపీ విజయసాయి రెడ్డిని క్వారంటైన్‌కు తరలించాలి' - పోతిన మహేశ్ తాజా వార్తలు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజారోగ్యం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తే...వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారని జనసేన నేత పోతిన మహేశ్ విమర్శించారు. ఆయనను వెంటనే క్వారంటైన్‌కు పంపించాలని డిమాండ్ చేశారు.