ISRO Chairman Dr.Sivan in KL : విజయవాడ KL డీమ్డ్ వర్సిటీ 11వ స్నాతకోత్సవంలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ శివన్ ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని చూచించారు. డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు శివన్ అభినందనలు తెలిపారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకురావాలనే విషయమై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ స్నాతకోత్సవంలో ఓల్వో కంపెనీ ఎండీ కమల్ బాలి, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, నటుడు అలీ తదితరులు పాల్గొన్నారు.
" ప్రపంచం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. విద్యార్థులు ఒకరితో ఒకరు పోటీ పడటం చాలా ముఖ్యం. తద్వారా మంచి ఉద్యోగాలను సాధించుకోవాలి. దాని వల్ల మంచి కెరీర్‌ను రూపొందించుకోగలుగుతారు. విద్యా, వృత్తిగత జీవితాల మధ్య విద్యాసంస్థలనేవి వారధిగా ఉండాలి. విద్యార్థుల్లో వ్యాపార లక్షణాలు గుర్తించడం, ఆ సామర్థ్యాలు పెంపొందించడానికి ఈ విద్యాసంస్థలే కీలక ప్రదేశం. విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రతి అడుగూ ప్రాక్టికల్‌గా వేస్తే.... కెరీర్ కోసం ప్రత్యేక ప్రణాళికలు అవసరం లేదు. మన నేటి చర్యలే రేపటి భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి. " - డా.శివన్, ఇస్రో ఛైర్మన్