ETV Bharat / city

విశాఖలో హబ్ ఏర్పాటుకు అమెరికా ప్రభుత్వం ఆసక్తి - cm jagan latest news

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్​తో అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్​మన్ భేటీ అయ్యారు. విశాఖలో హబ్ ఏర్పాటుకు తమ దేశ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎంకు వివరించారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల రాష్ట్రమన్న ముఖ్యమంత్రి... రాష్ట్ర ప్రగతికి అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.

invest hub in vizag under america government
విశాఖలో హబ్ ఏర్పాటుకు అమెరికా ప్రభుత్వం ఆసక్తి
author img

By

Published : Jan 5, 2021, 10:01 PM IST

విశాఖలో హబ్‌ ఏర్పాటుకు అమెరికా ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ఆ దేశ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్​మెన్... సీఎం వైఎస్ జగన్​కు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్​ను అమెరికా కాన్సుల్ జనరల్ సహా అధికారులు కలిశారు. విశాఖలో పర్యటించామని, అక్కడి వసతులు, సౌకర్యాలు ఎంతో సంతృప్తినిచ్చాయని ప్రతినిధులు సీఎంకు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు అహ్మదాబాద్‌లో మాత్రమే హబ్‌ ఉందని, ప్రస్తుతం విశాఖలోనూ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

దిల్లీలో ఉన్నట్లుగా విశాఖలోనూ అమెరికా ఇంక్యుబేటర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన విజ్ఞప్తికి అమెరికా కాన్సుల్‌ జనరల్‌ సానుకూలంగా స్పందించారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అత్యంత అనుకూలమైన రాష్ట్రమన్న సీఎం.. విశాల సముద్ర తీర ప్రాంతం అందుకు ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. నౌకాశ్రయాల నిర్మాణంతో ఆర్ధికాభివృద్ధి, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రగతికి అమెరికా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి.

'అభివృద్ధిని చూడలేకే అసత్య ఆరోపణలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.