వెలుగుల పండుగ దీపావళిని పర్యావరణహితంగా జరుపుకోవాలని పిలుపునిస్తున్నారు విజయవాడ విద్యార్థినులు. పర్యావరణాన్ని పరిరక్షించి... అనాథ బాలల్లో సంతోషాన్ని నింపేందుకు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. విజయవాడకు చెందిన నలంద డిగ్రీ కళాశాల విద్యార్థినులు బియ్యపు పిండితో ప్రమిదలు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వారం పాటు శ్రమించి ప్రమిదలకు హంగులద్దారు. సంప్రదాయ వస్త్రధారణలో దీపాల వెలుగులతోపాటు ఘుమ ఘుమలాడే వంటకాలతో దీపావళి శోభ ముందే తీసుకొచ్చారు. ప్రమిదలతో ప్రదర్శన ఏర్పాటు చేసి.. వాటి విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనాథల కోసం ఖర్చు చేయనున్నారు. వారితో కలిసి ఆనందంగా పండుగ జరుపుకుంటామని చెబుతున్నారీ చదువుల సరస్వతులు.
పర్యావరణహితంగా దీపావళి... ప్రతి ఇంటా జరగాలి - diwali celebrations
విజయానికి ప్రతీకగా నిలిచే పండగను... దీపాలతో ప్రతి ఇల్లు వెలుగులు జిమ్మేలా చేసుకుందాం అంటూ పిలుపునిస్తున్నారు ఆ విద్యార్థినులు. పర్యావరణహితమైన ప్రమిదలు తయారు చేసి వాటి విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును అనాథల కోసం ఖర్చు చేస్తామంటున్నారు.
![పర్యావరణహితంగా దీపావళి... ప్రతి ఇంటా జరగాలి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4865049-982-4865049-1571990324966.jpg?imwidth=3840)
వెలుగుల పండుగ దీపావళిని పర్యావరణహితంగా జరుపుకోవాలని పిలుపునిస్తున్నారు విజయవాడ విద్యార్థినులు. పర్యావరణాన్ని పరిరక్షించి... అనాథ బాలల్లో సంతోషాన్ని నింపేందుకు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. విజయవాడకు చెందిన నలంద డిగ్రీ కళాశాల విద్యార్థినులు బియ్యపు పిండితో ప్రమిదలు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వారం పాటు శ్రమించి ప్రమిదలకు హంగులద్దారు. సంప్రదాయ వస్త్రధారణలో దీపాల వెలుగులతోపాటు ఘుమ ఘుమలాడే వంటకాలతో దీపావళి శోభ ముందే తీసుకొచ్చారు. ప్రమిదలతో ప్రదర్శన ఏర్పాటు చేసి.. వాటి విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనాథల కోసం ఖర్చు చేయనున్నారు. వారితో కలిసి ఆనందంగా పండుగ జరుపుకుంటామని చెబుతున్నారీ చదువుల సరస్వతులు.
దీపావళి అంటే వెలుగుల పండుగ. అమావాస్య చీకట్లను పారదోలి జ్ఞాన దీప కాంతులను ప్రకాశింప చేసే చైతన్య దీప్తుల శోభావళి. అలాంటి పండుగను పర్యావరణ హితంగా రంగురంగుల దీపాలతో కాంతివంతంగా జరుపుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు విజయవాడ విద్యార్థులు. పర్యావరణాన్ని పరిరక్షించడం తోపాటు, సామాజిక బాధ్యతగా అనాధ బాలల్లో సంతోషాన్ని నింపేందుకు వినూత్న కార్యక్రమం నిర్వహించారు.
దీపావళి అంటే ప్రకృతిని కలుషితం చేయడం కాదని పర్యావరణ హితమైన దివ్వెల పండుగే నిజమైన వేడుకని విజయవాడకు చెందిన నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆచరించి చూపుతున్నారు. విజయానికి ప్రతీకగా నిలిచే పండుగను దీపాలతో ప్రతి ఇల్లు వెలుగొందేలా చేసుకుందాం అంటూ పిలుపునిస్తున్నారు. విద్యార్థులంతా కలిసి తమలోని సృజనాత్మకతను బయట పెట్టారు. బియ్యప్పిండితో ప్రమిదలు చేసి, మట్టితో చేసిన ప్రమిదలను సేకరించి వాటికి ఆకర్షణీయమైన రంగులు దిద్దారు. వారం రోజుల పాటు శ్రమించి ప్రమిదలకు ప్రాణం పోశారు. దీపాల వెలుగుల తో పాటు సంప్రదాయ వస్త్రాధారణ లు, ఘుమ ఘుమలాడే వంటకాలతో దీపావళి శోభను ముందే తీసుకొచ్చారు. పర్యావరణానికి హాని కలిగించని రీతిలో దీపావళి జరుపుకోవాలని సందేశం ఇచ్చారు. కొన్ని గంటల ఆనందం కోసం వేల రూపాయలు ఖర్చు చేయడం కన్నా ఇతరులకు సహాయం చేయడం లోనే మరింత సంతోషాన్ని పొందవచ్చని విద్యార్థులు చెబుతున్నారు. ప్రమిదల తో ప్రదర్శన ఏర్పాటు చేసి, వాటి విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనాధల కోసం ఖర్చు చేస్తామని, వారితో కలిసి ఆనందంగా పండుగను జరుపుకుంటామని విద్యార్థులు పేర్కొంటున్నారు.
బైట్1......... విద్యార్థిని
బైట్2.......... విద్యార్థిని
బైట్3.......... విద్యార్థిని
బైట్4.......... విద్యార్థిని
బైట్5........... అనురాధ, ప్రిన్సిపాల్, నలంద డిగ్రీ కళాశాల
- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648
Body:పర్యావరణ హిత దీపావళి పండుగను జరుపుకోవాలని విద్యార్థుల దీపాల ప్రదర్శన
Conclusion:పర్యావరణహిత దీపావళి జరుపుకోవాలని విద్యార్థుల దీపాల ప్రదర్శన