ETV Bharat / city

ఏపీని లాజిస్టిక్​ హబ్​గా తీర్చిదిద్దుతాం: గౌతమ్​ రెడ్డి

రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని సహకారం అందించేందుకు కేంద్రమూ ముందుకు వచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల అభివృద్ధి ద్వారా ఏపీని లాజిస్టిక్ హబ్​గా తీర్చిదిద్దుతామని ఆయన ఈటీవీ భారత్​తో వ్యాఖ్యానించారు. స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం ఐదు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వ రంగ సంస్థలు ముందుకువచ్చాయని తెలిపారు.

industries minister mekapati gautham reddy on ports

author img

By

Published : Sep 17, 2020, 4:19 PM IST

Updated : Sep 17, 2020, 6:07 PM IST

ఏపీని లాజిస్టిక్​ హబ్​గా తీర్చిదిద్దుతాం: గౌతమ్​ రెడ్డి

పెట్టుబడులపై సహకారానికి కేంద్ర మంత్రులు, అధికారులను కలిశారు కదా. ఏం హామీలు వారి నుంచి వచ్చాయి.?

రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టటంలో కేంద్రంలోని వివిధ శాఖల సహకారం కోరాం. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారులనూ సంప్రదించాం. స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా, ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ లాంటి కీలకమైన సంస్థల ఎండీలు, సీఈఓలను కలిశాం. పర్యాటక మంత్రిత్వశాఖ అధికారులు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​తోనూ సమావేశమయ్యాం. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, కేంద్ర నౌకాయాన మంత్రి మాన్సుఖ్ మాండవీయతో భేటీ జరిగింది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న నైపుణ్య కళాశాలల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సు కేంద్రాల ఏర్పాటుపై వారికి విజ్ఞప్తి చేశాం. వారి భాగస్వామ్యం కోరాం. దీనికి ఆయాశాఖలు అంగీకారాన్ని తెలిపాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా లేఖలు పంపాం. సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సు కేంద్రాల ఏర్పాటుపై మరో మూడు ప్రైవేటు సంస్థలు ‌ఒప్పందాలు చేసుకున్నాయి. మేం ఏర్పాటు చేసే 30 నైపుణ్య కళాశాలల్లో ఒక్కో చోట ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సు కేంద్రం రావాలన్నది మా ఆలోచన. దీంతో పాటు ఇతర నైపుణ్య కోర్సులు కూడా అందిస్తాం. రాష్ట్ర తీరప్రాంత అభివృద్ధికి సంబంధించి నౌకాయాన మంత్రి జరిగిన భేటీలో ఆయన కొన్ని హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 8 ఫిషింగ్ హార్బర్ జెట్టీల నిర్మాణంలో సహకారంతోపాటు డీప్ సీ ఫిషింగ్ బోట్లను రాయితీపై అందించేందుకు ముందుకు వచ్చారు. ఆ ప్రతిపాదన రాష్ట్రం నుంచి వస్తే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి ఆర్దిక సహకారం అందించాల్సిందిగా నీతిఆయోగ్ సీఈఓను కోరాం. దీనిపైనా ఏపీ నుంచి ప్రతిపాదనలు పంపుతున్నాం.

రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువచ్చేకంటే నైపుణ్యాభివృద్ధిపైనే ఎందుకు దృష్టి పెట్టారు ?

ప్రస్తుతం రాష్ట్రంలో సమగ్ర పరిశ్రమ సర్వే అని ఒకటి చేపట్టాం. ప్రస్తుతం పరిశ్రమల్లో పనిచేస్తున్న 70 శాతం మందికి సరైన నైపుణ్యాలు లేవని ప్రాథమికంగా తేలింది. వారికి నైపుణ్యాన్ని పెంచేందుకు వినతులు వస్తున్నాయి. అందుకే ప్రపంచస్థాయిలో నైపుణ్యం ఉన్న మానవ వనరుల్ని తయారు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఉంటే ఏ పరిశ్రమైనా మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఇక్కడే పెట్టుబడులు పెడుతుంది. ప్రతీ పరిశ్రమ మూడే అంశాలు చూస్తుంది. శాంతిభద్రతలు, మౌలిక వనరులు, నైపుణ్యం ఉన్న మానవవనరుల గురించి ఆలోచించిన తర్వాతే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. ఈ మూడింటినీ ఏపీ అందించగలిగితే ఏ పెట్టుబడిదారైనా రావాల్సిందే. మేమెక్కడా పెట్టుబడులను తీసుకువచ్చే అంశాన్ని వెనక్కు పెట్టలేదు. ముందుగా మౌలికమైన అంశాలను సరిదిద్దితే వాటికవే పెట్టుబడులు వస్తాయన్నది మా ఆలోచన. ముందుగా పరిశ్రమలకు అవసరమైన అంశాలను అభివృద్ధి చేశాకే వారికి కేటాయిస్తామని చెబుతున్నాం.

పెట్టుబడుల గురించి పక్కన పెట్టి కేవలం నైపుణ్యాభివృద్ధిపైనే దృష్టిపెడితే పరిశ్రమలు వచ్చే లోపు వారు ఇతర ప్రత్యామ్నాయాలు వెతుక్కునే అవకాశం లేదా?

ప్రస్తుతం మేం ఏర్పాటు చేయబోతున్న కళాశాలల నుంచి 9 లక్షల మంది నైపుణ్యం ఉన్న మానవ వనరులు వస్తారని అంచనా వేస్తున్నాం. పూర్తి స్తాయిలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసినా.. 2 లక్షల కంటే ఎక్కువ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇవ్వలేం. మిగతా ఏడు లక్షల మంది పొరుగు రాష్ట్రాలకో ఇతర ప్రాంతాలకో వెళ్తారు. అందుకే మేము నైపుణ్యమున్న మానవ వనరుల పరిశ్రమనే మేం పెడుతున్నాం. ఇది కచ్చితంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టేదని మా ఆలోచన. వైటూకే సమస్య వచ్చినప్పుడు ఎలాంటి నైపుణ్య కళాశాలలు లేవు కానీ ఏపీ విద్యార్దులు గణితంలోనూ విశ్లేషణలోనూ ప్రతిభ కనపరిచారు కాబట్టే మనవారికి ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి. అందుకే ప్రపంచంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా మనమే నైపుణ్యమున్న మానవవనరుల్ని సృష్టించాలని భావిస్తున్నాం.

రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే హైగ్రేడ్ స్టీల్స్ ప్రాజెక్టుపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ వచ్చింది. వారేమన్నా ఆర్దిక సహకారం అందిస్తారా

లేదు హైగ్రేడ్ స్టీల్స్ ఉక్క కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు. అయితే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఫీజిబిలిటీ పై కొన్ని ప్రైవేటు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. అందుకే త్వరలోనే రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్ ను జారీ చేస్తాం. ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై పోటాపోటీగా సంస్థలు పాల్గోంటాయని యోచిస్తున్నాం.

మీరు పోర్టులు అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. కానీ రాష్ట్రానికి చెందిన ఎగుమతులు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. మీరేమంటారు.

2015-2020 పారిశ్రామిక విధానం మా ప్రభుత్వం రూపోందించింది కాదు. మేం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానం ఎగుమతుల పాలసీ కాదు. సమీకృతంగా అభివృద్ధికి సంబంధించిన విధానం అది. ఎగుమతులు పెరగాలంటే వివిధ అంశాల అనుసంధానం సప్లై చైన్ ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కేంద్రం ఇటీవల ప్రకటించిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి విధానంలో భాగంగా జీఐ ట్యాగింగ్ చేసి ఎగుమతులను పెంచుకునే అవకాశం ఉంది. అయితే దీనికి కనీసం 2 నుంచి 3 ఏళ్ల సమయం పడుతుంది. స్థానికంగా ఉన్న పరిశ్రమల్ని భవిష్యత్ ఎగుమతుల కోసం సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతానికి ఆక్వా ఉత్పత్తులు మినహా మరే ఎగుమతీ రాష్ట్రం నుంచి లేదు.

విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో పెట్టుబడులకు, సహకారానికి కేంద్రం మరిన్ని హామీలు ఇచ్చిందా ?

వీసీఐసీకీ సంబంధించి కృష్ణపట్నం నోడ్​ను కేంద్రమే అభివృద్ధి చేస్తామని ముందుకొచ్చింది. 2,900 ఎకరాల భూమి రాష్ట్రం ఇస్తే పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పారు. అందులో ఏపీకూడా 50 శాతం భాగస్వామిగా ఉంటుంది.

ఇదీ చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ప్రారంభం.. 23 వరకు పరీక్షలు

Last Updated : Sep 17, 2020, 6:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.