ETV Bharat / city

గవర్నర్​తో ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ భేటీ - గవర్నర్​ బిశ్వభూషణ్​తో ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ అగస్ పి.సప్టోనో

ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనో.. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఇండోనేషియా నుంచి పెట్టుబడిదారులు రావచ్చని గవర్నర్ తెలిపారు.

indonesia republic consel meet governer bishwabushan harichandan
గవర్నర్​ను కలిసిన ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ అగస్ పి.సప్టోనో
author img

By

Published : Sep 4, 2021, 4:45 PM IST

ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనో.. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో సమకాలీన అంశాలపై వారు చర్చించారు.

దేశంలోనే రెండో పొడవైన సమద్ర తీర ప్రాంతం, సమృద్ధిగా సహజ వనరులతో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని.. ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్​కు.. గవర్నర్ వివరించారు. ఇక్కడి పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఇండోనేషియా నుంచి పెట్టుబడిదారులు రావచ్చని తెలిపారు. అనంతరం గవర్నర్ ఆయనను జ్ఞాపికతో సత్కరించారు. మొదటిసారి రాజ్‌ భవన్‌కు విచ్చేసిన ఇండోనేషియా కాన్సుల్ జనరల్ సప్టోనోకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా స్వాగతం పలికారు.

పారాలింపిక్స్‌లో విజేతలకు గవర్నర్ శుభాకాంక్షలు

టోక్యో పారాలింపిక్స్‌లో మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో బంగారు పతక విజేత మనీష్ నర్వాల్, రజత పతక విజేత సింఘ్రాజ్ అధనను రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన అవని లేఖారాను అభినందించిన గవర్నర్.. ఆమె ఇప్పటికే ఒక బంగారు పతకాన్ని సాధించడం ప్రశంసనీయమన్నారు. పారాలింపిక్ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచారని కొనియాడారు. పురుషుల వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన హర్విందర్ సింగ్‌ను కూడా గవర్నర్‌ అభినందించారు. దేశ ప్రజలు వారి విజయాలను చూసి గర్వపడుతున్నారని, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:

IAS TRANSFERS: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.