పార్టీ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తిపై నేతలతో చర్చించారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండోదశకు చేరిందని చంద్రబాబు వ్యాఖ్యనించారు. కొన్ని దేశాల్లో సాంకేతికత సాయంతో కరోనాను కట్టడి చేశారని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న వివరాలు ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారి లెక్కల్లో తేడాలు ఉన్నాయన్నారు.
ఇదీచదవండి