ETV Bharat / city

'ఆనందయ్య మందుకు ఆయుష్ శాఖ సూత్రప్రాయ అంగీకారం' - ఆనందయ్య మందుకు ఆయుష్ శాఖ సూత్రప్రాయ అంగీకారం

ఆనందయ్య తయారు చేసిన కొవిడ్​ మందుకు రాష్ట్ర ఆయుష్ శాఖ సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చిందని ఆయుర్వేద ఔషధ నిపుణుడు అనందయ్య తరఫు న్యాయవాది ఎన్ అశ్వనీకుమార్ హైకోర్టుకు తెలిపారు.

ఆనందయ్య మందుకు ఆయుష్ అంగీకారం
ఆనందయ్య మందుకు ఆయుష్ అంగీకారం
author img

By

Published : Aug 3, 2021, 7:02 AM IST

కొవిడ్ చికిత్సకు అందించే ఆనందయ్య మందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని.. ఆయుర్వేద ఔషధ నిపుణుడు అనందయ్య తరఫు న్యాయవాది ఎన్ అశ్వనీకుమార్ హైకోర్టుకు తెలిపారు. అయితే మందుకు పేరును ఖరారు చేయాల్సి ఉందన్నారు. కంటిచుక్కల మందుకు ఆమోదం ఇచ్చే అంశంపై జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉందని వివరించారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. అంగీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కొవిడ్​కు తాను తయారు చేసిన ఆయుర్వేద ఔషధాల పంపిణీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలని కోరుతూ.. ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద, సంప్రదాయ మందు పంపిణీ కార్యక్రమం కొనసాగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలువురు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

బెంజ్ సర్కిల్ వద్ద సర్వీసు రోడ్డు నిర్మాణ వ్యవహారంపై తీర్పు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.