ETV Bharat / city

SEC Neleam sahni: 'నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేయండి'..హైకోర్టులో పిల్! - నీలం సాహ్ని తాజా వార్తలు

ఎస్​ఈసీగా నీలం సాహ్ని(SEC Neleam sahni) నియామకాన్ని సవాలు చేస్తూ.. విజయవాడకు చెందిన జి.రామకృష్ణ దాఖలు చేసిన పిటీషన్ పై.. హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా అదనపు సమాచారాన్ని దాఖలు చేసేందుకు సమయం కావాలని పిటీషనర్ తరఫు న్యాయవాది కోరగా.. పూర్తి సమాచారం లేకుండా పిల్ ఎలా వేస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

neelam sahni
ఎన్నికల కమిషనర్​గా నీలం సాహ్ని.. విచారణ వాయిదా
author img

By

Published : Jun 16, 2021, 3:26 PM IST

Updated : Jun 17, 2021, 2:41 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని(SEC Neleam sahni)ని నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆమె నియామకానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఈ ఏడాది మార్చి 28 న జారీచేసిన జీవో 20ని రద్దు చేయాలని కోరుతూ విజయవాడకు చెందిన జి.రామకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి ముగ్గురు పేర్లతో ప్రభుత్వం తయారు చేసిన ప్యానల్​ను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి , రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి , వ్యక్తిగత హోదాలో విశ్రాంత ఐఏఎస్ నీలం సాహ్నిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అదనపు వివరాల్ని దాఖలు చేశానన్నారు. ధర్మాసనం స్పందిస్తూ .. ప్రధాన పిటిషన్లో ఆ వివరాల్ని పొందుపరచకుండా ప్రత్యేకంగా వేయడం ఏమిటని ప్రశ్నించింది. గవర్నర్ అధికారాలతో ముడిపడి ఉన్న ఇలాంటి విషయంలో పూర్తి సమాచారం లేకుండా వ్యాజ్యం దాఖలు చేయడం సరికాదంది. న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

High Court: పంచాయతీలుండగా..గ్రామ సచివాలయాలు ఎందుకు?

Last Updated : Jun 17, 2021, 2:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.