HC ON WOMEN POLICE: జీవో 59 పై విచారణ చేపట్టిన హైకోర్టు - ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజా వార్తలు
HC ON WOMEN POLICE:వార్డు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిలను మహిళా పోలీసులుగా గుర్తిస్తూ... ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 59 పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది.
HC ON WOMEN POLICE
HC ON WOMEN POLICE: వార్డు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తిస్తూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 59పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది రెండు వారాలు సమయం కోరగా.. తదుపరి విచారణను న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది.
గత విచారణలో జీవో 59 జారీపై ప్రభుత్వం పునరాలోచిస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని గత విచారణలో కూడా కోరటంతో .. వ్యాజ్యాలు నేడు మరోసారి విచారణకు వచ్చాయి.