ETV Bharat / city

పంతంగిలో భారీగా వాహనాల రద్దీ.. టోల్‌ బూత్‌లు ఓపెన్‌ - traffic at panthangi toll plaza

సంక్రాంతి సంబురం ముగిసింది. పల్లెలకు చేరిన జనమంతా భాగ్యనగరం బాట పట్టారు. ఫలితంగా.. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద రద్దీ భారీగా ఉండడంతో.. టోల్​ బూత్​లు ఓపెన్ చేయాల్సి వచ్చింది.

traffic at panthangi toll plaza
పంతంగిలో భారీగా వాహనాల రద్దీ.. టోల్‌ బూత్‌లు ఓపెన్‌
author img

By

Published : Jan 17, 2021, 10:24 PM IST

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. పండుగ అనంతరం ప్రజలు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద దాదాపు కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోయాయి.

టోల్‌ప్లాజా దాటేందుకు వాహనాలకు అరగంటకు పైగా సమయం పడుతోంది. ఫలితంగా.. హైదరాబాద్‌కు వచ్చే మార్గంలో 9 లేన్ల టోల్‌ బూత్‌లు ఓపెన్‌ చేశారు. పంతంగి టోల్‌ ప్లాజా వద్ద 8 ఫాస్టాగ్‌ గేట్లు ఓపెన్ చేసిన సిబ్బంది.. వాహనాలను పంపించి వేస్తున్నారు.

ఇదీ చూడండి : ఉత్సాహంగా ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.