తమ ఆసుపత్రిలో 20వ విడత జరిగిన శస్త్రచికిత్సలన్నీ విజయవంతమయ్యాయని ఆంధ్ర ఆసుపత్రి చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వైద్యులు రామారావు తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఈరోజు వరకు 10 మంది చిన్నారులకు క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలు చేశామన్నారు. హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే బృందం, సినీ నటుడు మహేశ్‌బాబు, రోటరీ క్లబ్‌ల సౌజన్యంతో ఎంతో ఖర్చుతో కూడుకున్న సర్జరీలు ఉచితంగా చేస్తున్నామని చెప్పారు. ఆంధ్ర హాస్పిటల్స్ పనితీరుపై యూకే బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి..