విజయవాడలో ఆంధ్ర ఆసుపత్రి వారు నిర్వహించిన 21వ పిల్లల గుండె సర్జరీ క్యాంపు విజయవంతంగా ముగిసింది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు, హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే బృందం సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారుల గుండె ఆపరేషన్లలో అతి క్లిష్టమైన కవాట సమస్యలున్న 15 మంది చిన్నారులకు శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్ పి.వి.రామారావు తెలిపారు. ప్రస్తుతం వీరంతా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. తమ విజయానికి వైద్యుల సమష్టి కృషే కారణమన్నారు. ప్రస్తుత రోజుల్లో పుట్టే పిల్లలకు పుట్టుకతోనే గుండె కవాట లోపాలతో పుడుతున్నారని డాక్టర్ దిలీప్ చెప్పారు. ఇలాంటి శస్త్రచికిత్సలు చేయడానికి 20 సంవత్సరాలు వస్తేనే సాధ్యమయ్యేదని... డాక్టర్ మహ్మద్ నాసిర్ ఆధ్వర్యంలో గుండెలోని భాగంతోనే కవాటాలను తయారు చేసి అమర్చే నూతన ప్రక్రియ కనుగొన్నామని తెలిపారు. ప్రతి ఏటా 7 వేల మంది పిల్లలు గుండె జబ్బులతో పుడుతున్నారని... అందులో కేవలం 600 మందికే గుండె శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు.
ఇదీ చదవండి: