ఎస్సీల అసైన్‌మెంట్ పట్టా ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలను సవాల్ చేస్తూ చంద్రశేఖర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను పిటిషనర్ సవాల్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకురులో పేద ఎస్సీల స్థలంలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.
పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం..పేద ఎస్సీల స్థలాల్లో ప్రభుత్వ భవన నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలిచ్చింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి