ETV Bharat / city

'ఐదేళ్లుగా 25 కోట్ల మందికి లబ్ధి చేకూర్చారు' - vijayawada

ప్రధాని మోదీ విజయంపై విజయవాడలోని పార్టీ కార్యాలయంలో భాజపా ఎంపీ జీవీయల్​ నరసింహారావు మాట్లాడారు. ఎంతో మందిగా ఉపాధినిచ్చారని, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని ప్రజలు విశ్వసించారు కాబట్టే తిరిగి ఎన్నికయ్యారని తెలిపారు.

'5 ఏళ్లుగా 25 కోట్ల మందికి లబ్ధిచేకూర్చారు'
author img

By

Published : May 24, 2019, 3:48 PM IST

'5 ఏళ్లుగా 25 కోట్ల మందికి లబ్ధిచేకూర్చారు'

సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీ నాయకత్వంలో భాజపా చారిత్రక విజయం సాధించిందని విజయవాడలోని పార్టీ కార్యాలయంలో భాజపా రాజ్యసభ ఎంపీ జీవియల్ నరసింహారావు అన్నారు. ఈ విజయం వెనుక మోడీ 5 ఏళ్లుగా 25 కోట్లమందికి ఉపయోగపడేలా చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయన్నారు. ప్రజలంతా బీజేపీని గెలిపిస్తే... జాతిని గెలిపించినట్లేనని భావించారన్నారు. ప్రజారంజక పాలన అందిస్తే విజయం వరిస్తుందని నిరూపణ అయ్యిందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్​ను చిన్న మోడీ అంటే విజయం ఇచ్చారని... నెలలు గడవక ముందే ప్రజలు కేసీఆర్​కు షాక్ ఇచ్చారన్నారు. ఏపిలో విజయం సాధించిన వైఎస్ ​జగన్​కు అభినందనలు తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఉంటానని జగన్ చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించారన్నారు. తెదేపా చేసిన తప్పులు, హద్దుమీరిన అహంకారం కూడా ఆ పార్టీకి నష్టం కలిగించాయన్నారు. ఏపీలో ఆశించిన ఫలితాలు బిజెపి సాధించలేదని దానిపై విశ్లేషించుకుని భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు.

Intro:AP_TPG_11_24_VELIVENNU_SUSPECTED_DEATH_AB_C1
పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో వ్యవసాయ కూలి గా ఉన్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన కంట మని వీర్రాజు పంట పొలాల్లో అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

Body:సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అపస్మారకం గా ఉన్న వీర్రాజు ను వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

Conclusion:వీర్రాజు మృతి అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.