ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్.. శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు సమాజానికి వాస్తుశిల్పులని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఏటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. డా. రాధాకృష్ణన్.. దేశ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించారని గవర్నర్ పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో అభివృద్ధి చెందబోదని గవర్నర్ అన్నారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి వల్ల విద్యాబోధనలో అంతరాయం నెలకొందన్నారు. ఈ తరుణంలో ఆన్‌లైన్, డిజిటల్ తరగతులను నిర్వహించడం ద్వారా ఉపాధ్యాయులు తమ విద్యా బాధ్యతలను నెరవేర్చడానికి చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.
ప్రతి ఒక్కరికీ హక్కుగా విద్య అందాలన్నది మా లక్ష్యం: సీఎం
భావిభారత పౌరుడి నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక భూమిక అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ హక్కుగా విద్య అందాలన్నది మా లక్ష్యం అన్న సీఎం జగన్.. మేం చేపట్టిన విద్యా సంస్కరణలతో గురువుల బాధ్యత మరింత పెరిగిందన్నారు.
ఇదీ చదవండి..
farmers problems: బంగారంలాంటి బంతిపూలు.. లాభాల్లేక నేలపాలు..!