ETV Bharat / city

మహాత్మునికి గవర్నర్ బిశ్వభూషణ్​​ నివాళులు

author img

By

Published : Jan 30, 2020, 4:33 PM IST

.

governor bishwabhushan tribute to gandhi
మహాత్మునికి గవర్నర్ బిశ్వభూషణ్​​ నివాళులు
మహాత్మునికి గవర్నర్ బిశ్వభూషణ్​​ నివాళులు

గాంధీ ఆశయాలు యావత్ ప్రపంచానికి అనుసరణీయమని... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్ర లయోల కళాశాలలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ 72వ వర్థంతి సభకు... గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి... 2 నిమిషాలు మౌనం పాటించారు. శాంతి, అహింస మార్గాలను ప్రపంచానికి చాటిన గాంధీజీని... 150 దేశాల్లో పూజించడం అందరికీ గర్వకారణమన్నారు. మద్యపాన నిషేధం, అంటరానితనం, వివక్షలను రూపుమాపేందుకు గాంధీ రచనలు ఎంతో దోహదపడతాయని వివరించారు. ఈ సభలో మాజీఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. మహాత్ముడు సూచించిన మార్గాలను అనుసరించి నడుచుకోవడమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి అని బుద్ధప్రసాద్​ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి

అమరావతిలో ఆగిన మరో రైతు గుండె

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.