ETV Bharat / city

కనీస జాగ్రత్తలతో కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చు: గవర్నర్ - governor suggestions to corona precautions

సమాజంలోని ప్రతి వ్యక్తీ సహకారంతో కరోనా వైరస్​కు అడ్డుకట్ట వేయవచ్చని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యానించారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి కరోనా జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతి అధికమవుతున్నందున ప్రజలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.

Governor bishwabhooshan harichandhan
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
author img

By

Published : Apr 30, 2021, 11:01 PM IST

మన దేశంలో ప్రజారోగ్యం అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కుంటోందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి వైద్యశాఖ సూచించిన ఆరోగ్య నియమాలను కచ్చితంగా పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ తమను, తమ కుటుంబసభ్యులను, తమ చుట్టూ ఉన్నవారిని రక్షించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు...

రోజూ వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందునా... వైద్య వనరులు, ఆరోగ్య మౌలిక సదుపాయాలపై విపరీతమైన ఒత్తిడి ఉందని గవర్నర్ అన్నారు. భాదితులకు అవసరమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కరోనా మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు.

లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు...

కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి తక్షణ సహాయం పొందాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. కొవిడ్ -19 కు వ్యతిరేకంగా పోరాడటానికి పరీక్ష, చికిత్స, కోవిడ్-నివారణ అనుగుణంగా ప్రవర్తన, టీకాలు వేయించుకోవడం వంటి వ్యూహాలను అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని గుర్తు చేశారు.

ఇవీచదవండి.

విషాదం: కరోనాతో ఒకేరోజు అన్నదమ్ములు మృతి

జర్నలిస్ట్‌ రోహిత్‌ సర్దానా మృతి.. మోదీ దిగ్భ్రాంతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.