ETV Bharat / city

'ఆజాది కా అమృత్ మహోత్సవ్​' ను విజయవంతం చేయాలి: గవర్నర్ - అమృత్ మహోత్సవ్​పై గవర్నర్ స్పందన

‘ఆజాది కా అమృత్ మహోత్సవ్​' లో భాగంగా.. స్వాతంత్య్ర సమరయోధులను, వారి కుటుంబ సభ్యులను సత్కరించాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ వేడుకల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.

governer bishwabushan harichandan speaks on azadi ka amrit mahostsav
'ఆజాది కా అమృత్ మహోత్సవ్​' ను విజయవంతం చేయాలి: గవర్నర్
author img

By

Published : Mar 12, 2021, 8:13 PM IST

ప్రధాని మోదీ ప్రారంభించిన ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్​' ను విజయవంతం చేయాలని.. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వామ్యలు కావాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవానికి 75 వారాల ముందుగా.. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారని గవర్నర్ పేర్కొన్నారు.

1930లో మహాత్మా గాంధీ నేతృత్వంలోని చారిత్రాత్మక ఉప్పు సత్యాగ్రహ దండి యాత్ర ప్రారంభమైందని.. దాని 91వ వార్షికోత్సవం కూడా ఈ సంవత్సరమేనని గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాటం, ఉద్యమం అనే అంశంపై ప్రదర్శనలు, పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవాలన్నారు. ఈ వేడుకల్లో భాగంగా.. స్వాతంత్య్ర సమరయోధులను, వారి కుటుంబ సభ్యులను సత్కరించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: పింగళి వెంకయ్య కుమార్తెకు సీఎం జగన్ సన్మానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.