Innovative Wishes: తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా యూకేలో ఉండే తెలుగు చిన్నారి చిగురుపాటి లాస్య తన అభిమానాన్ని చాటుకుంది. 'నాయకుడా నాయకుడా మళ్లీ నువ్వే రావాలి' పాటకు పియానో ట్యూన్ ప్లే చేసి అందరినీ ఆకట్టుకుంది. కృష్ణా జిల్లాకు చెందిన లాస్య తల్లిదండ్రులు వృత్తిరీత్యా యూకేలో స్థిరపడ్డారు. అతి చిన్న వయసులోనే అత్యధిక ట్యూన్లు ప్లే చేసిన ఘనత ఈ చిన్నారి దక్కించుకుంది. ఆరేళ్ల వయసులోనే సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి రెండుసార్లు ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. చంద్రబాబుపై అభిమానంతో పుట్టినరోజు సందర్భంగా ఆయన పాటకు పియానో ట్యూన్ ప్లే చేసి ఆకట్టుకుంది.
ఇదీ చదవండి: Chandrababu Birthday: 73వ ఏట అడుగుపెట్టిన చంద్రబాబు.. అదే నేటి నిర్ణయం