గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నగరాల అభివృద్ధి అమృత్ పథకం కింద విజయవాడ నగరానికి మంజూరైన నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం నగరంలో అమృత్ పథకం కింద తలపెట్టిన అభివృద్ధి పనులకు గుత్తేదారులకు నిధులు నిలిపివేశారని తెలిపారు. నిలిచిపోయిన అభివృద్ధి పనులతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నెల రోజుల్లోగా నిలిచిన అభివృద్ధి పనులు చేపట్టకుంటే తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తామని రామ్మోహన్ హెచ్చరించారు. నగరంలోని అభివృద్ధి పనులు పూర్తి చేయాలనీ చీఫ్ ఇంజినీర్ మరియన్నకు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు.
ఇదీ చదవండి: 13 నెలల్లో స్వరాజ్ మైదానంలో పనులు పూర్తి చేయాలి: సీఎం