విజయవాడలో కుటుంబ ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఐద్వా కృష్ణా పశ్చిమ నియోజకవర్గం కార్యదర్శి గర్రె పాలవెల్లి తెలిపారు. ఈ కేంద్రాన్ని అవసరం ఉన్న వాళ్లు వినియోగించుకోవాలని ఆమె కోరారు.
మహిళలకు అండగా ఉంటూ వారి కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు వచ్చిన ఈ కేంద్రం పరిష్కరిస్తుందన్నారు. ఈ కుటుంబ న్యాయ సలహా కేంద్రం ద్వారా సమస్యలతో వచ్చిన వారి కాపురాలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తామని ఆమె చెప్పారు.
ఇదీ చదవండి: