ETV Bharat / city

harishrao: తెలంగాణ మంత్రి హరీశ్​ రావు... కాన్వాయ్‌కి ప్రమాదం - హరీశ్​ రావు వార్తలు

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ (HARISH)​ రావు కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. సిద్దిపేట నుంచి హైదరాబాద్​ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

minister harish rao
మంత్రి హరీశ్​ రావు
author img

By

Published : Jun 21, 2021, 12:41 AM IST

తెలంగాణ మంత్రి హరీశ్​ రావు... కాన్వాయ్‌కి ప్రమాదం

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొండపాక వద్ద ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్(HARISH)​ రావు కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. అడవి పందుల గుంపు అడ్డు రావడంతో.. వాటిని తప్పించబోయి పైలట్​ వాహనం డ్రైవర్​ సడన్​ బ్రేక్​ వేశారు. ఫలితంగా కాన్వాయ్​లోని వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఘటనా స్థలి నుంచి మరో వాహనంలో హరీశ్‌ రావు హైదరాబాద్​కు వెళ్లారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే.. హరీశ్​రావుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఫోన్​ చేశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తను క్షేమంగానే ఉన్నట్లు హరీశ్​ రావు తెలిపారు.

సిద్దిపేట నుంచి హైదరాబాద్​కు వెళ్తున్న క్రమంలో కొండపాక వద్ద నా కారుకు ప్రమాదం జరిగింది. నేను క్షేమంగానే ఉన్నా. నా డ్రైవర్, గన్​మెన్​కు స్వల్ప గాయాలయ్యాయి. వారు కూడా క్షేమంగానే ఉన్నారు. దయచేసి శ్రేయేభిలాషులు, మిత్రులు ఆందోళన చెందొద్దని కోరుతున్నా. -హరీశ్​ రావు, ఆర్థిక శాఖ మంత్రి

  • సిద్ధిపేట నుండి హైదరాబాద్ కు తిరుగుప్రయాణంలో కొండపాక వద్ద నా కారుకు ప్రమాధం జరిగింది. నేను క్షేమంగానే ఉన్నా. నా డ్రైవర్, గన్ మెన్ కు స్వల్ప గాయాలయ్యాయి. వారు కూడా క్షేమంగానే ఉన్నారు. దయచేసి శ్రేయేభిలాషులు, మిత్రులు ఆంధోళన చెందవద్దని కోరుతున్నా.

    — Harish Rao Thanneeru (@trsharish) June 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: ACCIDENT: ఆగి ఉన్న లారీని ఢీకొన్న డీసీఎం..50 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.