ETV Bharat / city

స్మృతులు: అమ్మవారికి 'ఆషాడం సారె' ఆలోచన 'పైడికొండల'దే - Pydikondala Manikyala Rao died

'ఆషాడం సారె'..ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో ఎంతో ప్రాచుర్యం పొందిన వేడుక. అయితే ఈ కార్యక్రమం అమల్లోకి రావటం...అమ్మవారి సన్నిధికి మహిళలు పెద్ద ఎత్తున తరలిరావటంలో అప్పటి మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆలోచన ఉంది.

indrakeeladri
indrakeeladri
author img

By

Published : Aug 1, 2020, 11:30 PM IST

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఆషాడం సారె ఎంతగా ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే. అయితే దాని వెనక ఉన్న ఆలోచన ఎవరిచ్చారనేది మాత్రం చాలామందికి తెలియదు. 2017లో ఆషాడం సారె కార్యక్రమం దుర్గగుడిలో మొదలైంది. అప్పట్లో దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాలరావుదే ఈ ఆలోచన.

రద్దీ పెరిగింది...

అమ్మవారి దర్శనానికి వచ్చిన సమయంలో అప్పటి ఆలయ ఈవో సూర్యకుమారితో ఈ ఆలోచన చెప్పారు. సహజంగా ఆషాడ మాసంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో భక్తుల సంఖ్యను పెంచేందుకు ఆషాడం సారె కార్యక్రమం ఉపయోగపడింది. ఆయన ఆలోచనకు తగ్గట్లే మహిళలు పెద్దఎత్తున ఆషాడం సారె తీసుకురావటం మొదలుపెట్టారు. వివిధ ఆలయాలతో పాటు గ్రామాలు, పట్టణాల్లోని భక్త సమాజాలు ఆషాడం సారెను అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఇలా బృందాలుగా వచ్చిన వారికి ఆలయ అధికారులు ప్రత్యేకంగా దర్శనం ఏర్పాట్లు కూడా చేశారు. ఆలయ ఆదాయం పెరిగేందుకు కూడా ఈ కార్యక్రమం దోహదపడింది. అయితే మాణిక్యాలరావు ఎక్కడా కూడా ఈ ఆలోచన తనదని బయటకు చెప్పలేదు.

ఇంద్రకీలాద్రితో పాటు మిగతా ఆలయాల్లోనూ ఆధ్యాత్మికత కార్యక్రమాలు పెంచే విషయంలో ఆయన సలహాలు అమూల్యమని అధికారులు గుర్తు చేసుకుంటారు. ఆర్.ఎస్.ఎస్ నేపథ్యం ఉండటంతో ఆయనకు సహజంగానే భక్తి ఎక్కువ. అందుకే ఆలయాల పవిత్రత, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని భావించేవారు. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో కొన్ని ఆలయాలను తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో మంత్రిగా ఉన్న మాణిక్యాల రావు స్వయంగా రంగంలోకి దిగారు. ఉద్రిక్తతలకు అవకాశం ఇవ్వకుండా ఆలయాలను ప్రభుత్వం తరపున నిర్మిస్తామని చెప్పటం ద్వారా వివాదానికి చోటు లేకుండా చూశారు.

దేవదాయశాఖ మంత్రిగా సేవలందించిన పైడికొండల మాణిక్యాలరావు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. మంత్రిగా ఆయన చేసిన సేవలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి

కరోనాతో మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.