ETV Bharat / city

'దళిత యువతి హత్య కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలి' - విజయవాడ యువతి హత్యపై పీతల సుజాత స్పందన

విజయవాడ దళిత యువతి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు. దిశ చట్టం పేరుకే గానీ.. దాని వలన ఏ మహిళకూ ఇంతవరకు న్యాయం జరగలేదని విమర్శించారు.

pithala sujatha
పీతల సుజాత, మాజీ మంత్రి
author img

By

Published : Oct 16, 2020, 5:07 PM IST

చట్టాలు ప్రభుత్వానికి చుట్టాలుగా మారుతుండటం బాధాకరమని మాజీమంత్రి పీతల సుజాత మండిపడ్డారు. విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో యువతి బలి కావడం బాధాకరమన్నారు. మహిళలపైన దాడులు, అఘాయిత్యాలు పెరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. దిశ చట్టం ఉండీ లేనట్టేనన్న పీతల సుజాత... తెదేపా హయాంలో కట్టిన భవనాలకు దిశ పోలీస్ స్టేషన్ అని పేరు మార్చడం తప్ప మహిళలకు ఎలాంటి న్యాయం జరగలేదని దుయ్యబట్టారు. దళిత యువతి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..

తుని మండలంలో డ్రోన్​ ద్వారా విద్యుత్ పునరుద్ధరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.