రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ ఉపయోగించి తెదేపాను అంతమొందించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని నక్కా ఆనందబాబు ఆరోపించారు. గతంలో ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్ చెప్పారని.. ఇప్పుడు పోలీసులను అడ్డుపెట్టుకొని తెదేపా నేతలపై కక్షసాధిస్తున్నారని విమర్శించారు. దేశంలో కొత్త సంస్కృతిని ఈ ప్రభుత్వమే మొదలుపెట్టిందని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడిని రాత్రికిరాత్రి డిశ్ఛార్జ్ చేయాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు. అరెస్టులతో తెదేపాను భయపెట్టలేరని.. ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు.
ఇదీ చదవండి: