Ex Minister Jawahar On Liquor Rates : జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోందని మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్. జవహర్ మండిపడ్డారు. జగన్ మద్యపాన నిషేదానికి తూట్లు పొడిచి పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. మద్యపాన నిషేధానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు.
గత ప్రభుత్వంలోని నాణ్యమైన బ్రాండ్‌ని తీసుకొస్తానని జగన్ చెప్పడం.. అప్పటి ప్రభుత్వ పాలసీనే బెటర్ అని ఒప్పకోవటమేనని స్పష్టం చేశారు. దశలవారీ మద్యపాన నిషేదం పేరుతో మరొక అస్త్రాన్ని తీసుకువచ్చారన్నారు. మద్యం లేకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం 20 శాతం మద్యం రేట్లు తగ్గిస్తున్నారన్న ప్రభుత్వం అసలు ఎందుకు పెంచిందని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : poor people:మాకు ఏ 'గుర్తింపు' లేదు.. మేము మనుషులమే..!