వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ నేరచరిత్ర అందరికీ తెలిసిందేనని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. చిన్నారిని అత్యాచారం చేసినందుకు పొక్సో చట్టం కింద మాధవ్‌పై కేసు నమోదైందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారన్నారు. ఎక్కడున్నా తన నేరస్వభావాన్ని కొనసాగించే వ్యక్తి చంద్రబాబు, పరిటాల రవీంద్రలపై విమర్శలు చేయటం హాస్యాస్పదమన్నారు. రౌడీలకు పదవులిచ్చిన వైకాపా ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. క్రిమినల్ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు.
ఇదీచదవండి